ఇది దోపిడీ పాలన

18-11-2026 | 05:35am

బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, నవంబర్ 17(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా పాలన(People's Governance) దోపిడీ పాలనగా మారిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(R.S. Praveen Kumar) విమర్శించారు. బీఆర్‌టీయూ(BRTU) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన అన్ని కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి(Round Table Meeting of Trade Unions) ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫేక్ ఎఫ్‌ఐఆర్‌లు బుక్(Booking of fake FIRs) చేసి, ఫేక్ డెత్ సర్టిఫికెట్లు(Fake death certificates) తీసుకొచ్చి,ఫేక్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు సృష్టించి ట్రయల్ బ్లెజర్ కంపెనీ వాళ్లు ఒక్కొక్క క్లెయిమ్‌కు లక్ష రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

అయితే ఇది కేవలం పెద్దపల్లి, మంచిర్యాలలో మాత్రమే కాదు.. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి కార్యాలయం కేంద్రంగా జరిగిందన్నారు. 600 కోట్లు ఏటీసీలకు పంపించిన డబ్బు కాకుండా, కార్మిక శాఖలో 150 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సెస్ ద్వారా బోర్డు లోకి వచ్చిన డబ్బును బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 346 కోట్లు ట్రయల్ బ్లెజర్ కంపెనీకి పంపితే, ఆ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, క్రెడిట్ యాక్సెస్ లైఫ్ కంపెనీలకు మళ్లించారన్నారు. అలాగే సహజ మరణాలకు చెల్లించాల్సిన 250 కోట్లు క్రెడిట్ యాక్సెస్ లైఫ్ కంపెనీకి పంపించారని, అయితే ఆ కంపెనీకి 250 కోట్లు చెల్లించే కెపాసిటీ లేదన్నారు. ఐక్య వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు