ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం

28-10-2026 | 02:38pm

ముకరంపుర, అక్టోబర్ 28(విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల్లో(Government School) విద్యార్థులకు(Students') ఉదయం పూట పౌష్టికాహారం అందించే అల్పాహార కార్యక్రమాన్ని 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉదయం పూట పౌష్టికాహారం(Nutritious food) తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా(Health) ఉండటంతో పాటు, చదువుపై మరింత ఏకాగ్రత సాధించగలుగుతారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాఠశాలలోనే నాణ్యమైన అల్పాహారం అందించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, పిల్లలకు పౌష్టికాహారం అందుతుందని అన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని కార్పొరేటర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు