వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

12-11-2026 | 10:03pm

డీఎంహెచ్‌ఓ బి రాజగోపాలరావు

హుజురాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి(Huzurabad Government Civil Hospital)ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (District Medical and Health Officer)  గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుద్ధ్యం, మందుల లభ్యత, సిబ్బంది పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరితో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను బాధ్యతగా నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు