క్యాన్సర్‌పై అవగాహనతోనే మహమ్మారిని ఎదుర్కోవచ్చు
డాక్టర్ హరిత లక్కరాజు
భిక్కనూర్, నవంబర్ 10 (విజయ క్రాంతి): క్యాన్సర్‌పై(Cancer) భయపడకుండా అవగాహన పెంచుకోవాలని, ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం తీసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) దక్షిణ ప్రాంగణ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ హరిత లక్కరాజు అన్నారు. మంగళవారం యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలోని సెమినార్ హాల్లో ఎన్ఎస్ఎస్ యూనిట్-6, ఇస్కాన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘కిల్ ద క్యాన్సర్'Kill the Cancer'’ అంశంపై వ్యక్తిత్వ వికాసం, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్. నారాయణ గుప్తా అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హరిత లక్కరాజు మాట్లాడుతూ ప్రకృతికి దూరం కావడం, ప్లాస్టిక్ వినియోగం, పోషకాహార లోపం వంటి అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. శరీరంలో అసాధారణ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ నారాయణ గుప్తా మాట్లాడుతూ యోగా, నడక వంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పొగాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు.
డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ ప్రతిజ్ఞ మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ డాక్టర్ జి. సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.