కారేపల్లి ఎస్సైకు కాంగ్రెస్ నాయకుల స్వాగతం..

10-11-2026 | 06:52pm

సింగరేణి: కారేపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వి. రమేష్(SI Ramesh)ను మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ తరపున పోలీస్ శాఖకు ఎల్లవేళలా పూర్తి సహకారం అందిస్తామని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  హీరాలాల్, జిల్లా నాయకులు భీముడు నాయక్,  బోళ్ల రమేష్, వాంకుడోత్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు