పర్యావరణ విధ్వంసంపై కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు
ముకరంపుర, నవంబర్ 10 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ(Satavahana University) క్యాంపస్లో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న భారీ తవ్వకాలు, మట్టి తరలింపు, ఎన్నో ఏళ్ల నాటి చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసంపై విశ్వవిద్యాలయ విద్యార్థులు కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదు చేశారు.
గాలరీ, లా కళాశాల, సింథటిక్ ట్రాక్ వంటి అభివృద్ధి పనుల పేరుతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీగా తవ్వకాలు చేపట్టింది. ఈ చర్యల వల్ల క్యాంపస్లో దుమ్ము, శబ్ద కాలుష్యంతో పాటు సహజ పర్యావరణం, జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.