క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల పరిశీలన

05-11-2026 | 03:13pm

ముకరంపుర, నవంబర్ 5(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ(Karimnagar Municipal Corporation) లోని19వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఆధునిక హంగులతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు.బర్నింగ్ ప్లాట్‌ ఫామ్‌తో పాటు, కాలనీలోని మెయిన్ చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీ సీసీ పనులను ప్రారంభించి, నూతనంగా నిర్మిస్తున్న బర్నింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాల ఏర్పాట్లను 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి–కృష్ణ గౌడ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ల సహకారంతో పనులు పూర్తి కానున్నాయి అని అతి త్వరలోనే వీరందరి సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

నాణ్యతతో పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్మశాన వాటికను ఆధునీకరిస్తున్నట్లు కార్పొరేటర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు