మన్యంకొండలో పండుగ సాయన్న భారీ విగ్రహం ఏర్పాటు
మహబూబ్‌నగర్ రూరల్ (విజయక్రాంతి): పేద ప్రజల హక్కుల(People's rights) కోసం పోరాడి ప్రజల గుండెల్లో నిలిచిన తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ(Telangana’s Robin Hood Festival) సాయన్న పోరాట చరిత్రను భావితరాలకు అందిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ దేవాలయ ప్రాంగణంలో పండుగ సాయన్న భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న తెలంగాణ పర్యాటక హోటల్‌ను సందర్శించారు. త్వరలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.