70వ రాష్ట్ర స్థాయి యస్జిఎఫ్ఐ పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులు
కొత్తపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న యస్జిఎఫ్ఐ 70వ తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్, హ్యాండ్ బాల్ పోటీలకు పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికకావడం జరిగింది. ఇటీవల కేశవపట్నంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో 8వ తరగతికి చెందిన ఈ రక్షిత్ బాలుర అండర్-14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడం జరుగుతుంది.అదే విధంగా సిరిసిల్ల లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో 10 వ తరగతికి చెందిన సి.హెచ్. భువన , 9 వ తరగతికి చెందిన ఏ. మోక్షజ్ఞ అండర్-17 బాలికల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డా. ఇ. ప్రసాదరావుతో పాటు డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, కె. హన్మంతరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, సమన్వయకర్తలు నాగరాజు, రాము, రబీంద్రపాత్రో,భవానీ, నిఖిత, వ్యాయామ ఉపాధ్యాయులు యస్. రాజు, సాజన్ , గౌతమ్ , శ్రీనివాస్, అమర్ లు పాల్గొన్నారు.