సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

21-11-2026 | 07:36pm

చొప్పదండి 21 నవంబర్ (విజయక్రాంతి): చెకుముకి మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో(Chekumuki Mandal-Level Science Talent Test) చొప్పదండి మండల(Choppadandi Mandal) కేంద్రంలోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్(Rukmapur Sainik School) విద్యార్థుల ప్రతిభ కనబరిచారు. కరీంనగర్‌లో  నిర్వహించిన చెకుముకి మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో  సైనిక్ స్కూల్, రుక్మాపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు: ఏం అజయ్ 10 తరగతి రాకేష్– IX తరగతి అంజితVIII తరగతి వీరు ఈ నెల 28వ తేదీన జరగనున్న జిల్లా స్థాయి పోటీలలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కల్నల్ రాజదత్త, ప్రిన్సిపాల్ పి. దేవేందర్, వైస్ ప్రిన్సిపాళ్లు కె. శ్రీనివాస్ మరియు ప్రమోద్ రాజు అభినందించారు. జిల్లా స్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు