చొప్పదండి సిద్ధార్థ కు స్వర్ణ పథకం
చొప్పదండి 18 నవంబర్ (విజయక్రాంతి) : చొప్పదండి సిద్ధార్థ స్కూల్(Choppadandi Siddhartha School) విద్యార్థి పి. అవినాష్(Student P. Avinash) కు జిల్లా స్థాయి చెస్ పోటీలో(District-level Chess Competition) స్వర్ణ పతకం లభించింది. సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి(Dasari Sripal Reddy) అభినందించినారు. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లాలోని(Karimnagar District) చైతన్య యూత్ క్లబ్ లో గజ్వేల్ చెస్ అకాడమీ వారు చెస్ పోటీలను నిర్వహించారు. ఈ చెస్ పోటీలకు(Chess competition) చొప్పదండి సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థి పి. అవినాష్ పాల్గొని, దానిలో తన అత్యుత్తమ ప్రతిభను కనబరిచి స్వర్ణ పతకం(Gold medal) సాధించాడు. దానితోపాటు చెస్ అకాడమీ వారు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు.
దానితోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మై గావ్ వారు నిర్వహించిన సిఆర్పిఎఫ్ అనే అంశంపై చిత్రలేఖనాన్ని నిర్వహించగా దానిలో ఎ. శ్రీవిద్య, పి.అవిఘ్న,బి.సుహాన్ మరియు యం.శివదత్త విద్యార్థులు పాల్గొని ప్రశంసా పత్రాలను అందుకున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక కల దాగి ఉంటుందని దాన్ని వెలికి తీసినప్పుడే వారి ప్రతిభ కనబడుతుందని అన్నారు.
ఇలా చెస్ పోటీలో గోల్డ్ మెడల్స్ సాధించిన తొమ్మిదవ తరగతి విద్యార్థి పి.అవినాష్ ను ప్రశంసించారు. మరియు చిత్రలేఖనంలో తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో కృషి చేస్తే ఎంతటి విజయాన్ని అయినా సొంతం చేసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్కూల్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మరియు తదితరులు ఆ విద్యార్థులను అభినందించారు.