సచిన్ సావంత్ తో సిరాజ్ హుస్సేన్ భేటీ
కరీంనగర్ సిటీ నవంబర్12 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(Telangana Pradesh Congress Committee) అధికార ప్రతినిధి గా నియమితులైన సిరాజ్ హుస్సేన్ ఈరోజు గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సహ ఇన్ చార్జ్ శ్రీ సచిన్ సావంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సందర్భంగా తనకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించినందుకు సచిన్ సావంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, యూపీఏ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జీవిత ప్రస్థానాన్ని వివరించే పుస్తకాన్ని సచిన్ సావంత్ సిరాజ్ హుస్సేన్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సిరాజ్ హుస్సేన్ తెలిపారు.