పోచంపల్లి మోడల్ స్కూల్‌కు ప్రత్యేక బస్సులు కేటాయించాలి

13-11-2026 | 07:28pm

ముకరంపుర, నవంబర్ 13(విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్(Students' Federation of India) మానకొండూర్ మండల కమిటీ(Manakondur Mandal Committee) ఆధ్వర్యంలో పోచంపల్లి మోడల్ స్కూల్(Pochampally Model School) విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను తక్షణమే పరిష్కరించి, పాఠశాలకు ప్రత్యేక బస్సులు కేటాయించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆసం పెళ్లి వినయ్ మానకొండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పోచంపల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆసంపెల్లి వినయ్ సాగర్ మీడియా తో మాట్లాడుతూ విద్యార్థుల కు సరిపడా బస్సులు లేకపోవడం, రూట్లకు అనుగుణంగా బస్సులు నడపకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల వల్ల విద్యార్థుల చదువుపై  ప్రభావం పడుతోందని తెలిపారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి, కరీంనగర్‌లోని పోచంపల్లి మోడల్ స్కూల్‌కు  బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, నాయకులు అభిషేక్,హర్ష,రాజు,శశి వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు