రేషన్ కార్డుల పంపిణీ
చొప్పదండి 21 నవంబర్ (విజయక్రాంతి): చొప్పదండి మండలంలోని(Choppadandi Mandal) అర్నకొండ గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల(Ration Card) పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షులు,చొప్పదండి సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల భారాస ప్రభుత్వంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు(Ration Card) కూడా ఇవ్వలేదని కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందించడంతో పాటు సన్న బియ్యంతో వారి కడుపు నింపుతున్నామన్నారు.
చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం(Medipalli Satyam) గారి కృషి, పట్టుదలతో మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అందించడం లో కూడా ముందు ఉంటుందని నిరూపిస్తూ చేయుత పెన్షన్ల తో పాటు భూమి నిరుపేద కుటుంబాలకు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు గల వ్యక్తులకు నూతనంగా ఇందిరమ్మ భీమా పథకం ద్వారా 5లక్షల రూపాయిల ఆర్థిక సహాయం అందించే పథకానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం అని తెలియజేశారు అనంతరం అధికారులతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వడ్లూరి లక్ష్మీ భూమయ్య చొప్పదండి మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజనపురం చందు,ఉప సర్పంచ్ జక్కుల అనిల్ కుమార్ నెరుమట్ల మల్లేశం,మహేశుని మల్లేశం గ్రామ శాఖ అధ్యక్షులు గడమళ్ళ గంగారాం,సింగిల్ విండో డైరెక్టర్స్ ఎల్లాల సంతోష్ రెడ్డి,బుస భీమయ్య,రాపెల్లి ఐలయ్య,మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిలుముల స్వప్న, గర్షకుర్తి సునీత జక్కుల జనార్ధన్, మచ్చ రమేష్,సోమిడి శ్రీనివాస్,పిట్ట మనోహర్,ఇరుకుళ్ళ సంతోష్, బుస అజయ్,బడుగు నరేష్,ప్రజలు,నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు*