తెలంగాణ రక్షణ సేనలో చేరిన మహిళలు

21-11-2026 | 07:34pm

చొప్పదండి 21 నవంబర్ (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) కరీంనగర్ జిల్లా ప్రదాన కార్యదర్శి బోడా రాకేష్ రేడ్డి(Boda Rakesh Reddy) అధ్వర్యంలో పలువురు యువకులు మహిళలు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి మ్యాకల తిరుపతి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ కవితక్కతో కలిసి సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి తెలంగాణ ప్రజలు సిద్దమవుతున్నారని అన్నారు.

వెనుకబడిన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇంకా అత్యంత పేదరికంలోనే జీవిస్తున్నారని,.  పేదరికాన్ని నిర్మూలించే వరకు సామాజిక న్యాయం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో ముద్ర కోల లక్ష్మీ,గుడ్ల వసంత,పసులోటి స్టిల్లాకూమారి,చెరుకూరి అంజలి రమ్య స్వరూప,లాస్య, నవీన్, తిరుపతి, కోటేష్,సాయికుమార్ లు ఉన్నారు.

మరిన్ని వార్తలు