ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ముగ్గురికి తీవ్రగాయాలు
కరీంనగర్ క్రైం నవంబర్ 27(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) తిమ్మాపూర్ మండలం రేణికుంట వంతెన(Renikunta bridge) వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. గోదావరిఖని(Godavarikhani) నుంచి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు(RTC bus), డివైడర్ దాటుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కాలు విరగగా, ట్రాక్టర్‌పై ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తిమ్మాపూర్ సీఐ, ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.