కేశిరెడ్డిపల్లి రైతులకు భూ రిసర్వే పై గ్రామసభ
ఎర్రుపాలెం నవంబర్ 18 ( విజయ క్రాంతి): మండల కేంద్రంలోని రైతువేదిక నందు కేసిరెడ్డిపల్లి రైతులకు(Kesireddypalli farmers) భూరి సర్వే పై అవగాహన గ్రామసభ ను నిర్వహించారు. సర్పంచ్ శ్రీమతి నండ్రు అశ్వని అధ్యక్షతన తహసీల్దార్ ఎర్రుపాలెం (Tahsildar, Errupalem) సమక్షంలో కేశిరెడ్డిపల్లి రెవిన్యూ లో భూములు రీ -సర్వే చేయుట గురించి రైతులందరికి అవగాహన గ్రామసభ ఏర్పాటు చేశారు.
గ్రామసభ లో తహసీల్దార్ సునీతఎలిజబెత్ మాట్లాడుతూ కేశిరెడ్డిపల్లి రెవిన్యూ పరిధిలో వున్న రైతులందరు సర్వే జరిగే సమయంలో రైతులు స్వయంగా తమ భూముల వద్ద ఉండి హద్దులను చూపించి,సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
రీ -సర్వే పూర్తయిన తర్వాత భూముల సరిహద్దులు స్పష్టంగా తేలి రైతులకు మరింత పారదర్శకమైన మరియు ఖచ్చితమైన రికార్డు లు అందుబాటులో వస్తాయని తెలిపారు రీ -సర్వే ప్రక్రియపై రైతులు అడిగిన వివిధ ప్రశ్నలకు మరియు సందేహాలకు సమాధానాలు ఇచ్చి ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా నిభందల ప్రకారం పారదర్శకంగా సర్వే జరుగుతుంది అని తెలియజేసినారు.
ఈ గ్రామసభ లో ఆర్ ఐ రవికుమార్, శ్రీషా, సర్వేయర్ రాజశేఖర్ మరియు జిపిఓ లు బాలయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు నాగార్జునరెడ్డి మరియు కేశిరెడ్డిపల్లి గ్రామ రైతులందరు పాల్గొన్నారు.