ముదిగొండ మండలంలో మిషన్ భగీరథ నీటి దుర్వినియోగం

03-11-2026 | 05:14pm

మాధాపురం గ్రామంలో ఆలయ ఆవరణలో అక్రమ ఆర్వో ప్లాంట్.. గ్రామస్తుల ఆందోళన

ముదిగొండ, విజయక్రాంతి.నవంబర్ 3: ముదిగొండ మండలం మాధాపురం గ్రామంలో మిషన్ భగీరథ నీటిని(Mission Bhagiratha water) అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కొత్తగా ఒక ప్రైవేట్ ఆర్వో వాటర్ ప్లాంట్ ను(Private RO Water Plant) ఏర్పాటు చేశారు.

ఈ ప్లాంట్ కు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ నుండి నేరుగా అక్రమ కనెక్షన్ తీసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసి అందిస్తున్న తాగునీటిని, తిరిగి ఆర్వో ప్లాంట్ లో శుద్ధి చేస్తున్నట్లుగా చూపి విక్రయిస్తున్నారని ఆరోపణ. దీనివల్ల నీరు వృధా అవ్వడమే కాకుండా, రానున్న వేసవిలో గ్రామంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయంపై చట్ట విరుద్ధంగా మిషన్ భగీరథ నీటిని వాడుకుంటున్న ఆర్వో ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు MPDO కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని MPDO, RWS అధికారులను కోరారు.

మరిన్ని వార్తలు