ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
19-11-2026 | 03:40pm
బేల నవంబర్ 19 (విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి(India's first female Prime Minister), ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బేల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇందిరా గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశయాలు, దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.