ఆలయ అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ
ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్, మాలదారులకు షవర్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు...
సింగరేణి, నవంబర్ 18, విజయక్రాంతి: భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని సామ్యతండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధికి సర్పంచ్ బానోత్ హిరాలాల్ ప్రత్యేక చొరవ చూపించారు. ఆలయ పరిసర ప్రాంతంలో ఫ్లోరింగ్ లేక భక్తులు, మాలదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆలయ ప్రాంగణమంతా ఫ్లోరింగ్ పనులు చేపట్టడంతో పాటు, స్వామివారి మాలధారణ చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అవసరమైన విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేయించారు. దీంతో ఆలయ పరిసరాలు మరింత సౌకర్యవంతంగా మారడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఆలయ చైర్మన్ ధరావత్ కళ్యాణ్ పేర్కొనారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తూ సర్పంచ్ హిరాలాల్ ముందుకు సాగడంపై ఆలయ చైర్మన్ కళ్యాణ్,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.