క్విజ్‌లో విజ్ఞాన్ విద్యార్థుల సత్తా.

14-11-2026 | 05:31pm

కల్లూరు, నవంబర్ 14 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన క్విజ్ పోటీల్లో (Anti-Drug Awareness Quiz) కల్లూరులోని విజ్ఞాన్ విద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 320 పాఠశాలలకు చెందిన 1,040 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, విజ్ఞాన్ విద్యానికేతన్‌కు చెందిన ఎం.డి. అబ్దుల్ నెజాద్, టి. సిద్ధీక్ష బహుమతులు సాధించారు.

క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం వల్లే విద్యార్థులు ఈ విజయాలు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ ఇస్మాయిల్ తెలిపారు. విజేతలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు

మరిన్ని వార్తలు