గ్రామీణులకు ఉచిత నేత్ర వైద్య సేవలు
* సర్వారంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం
* కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి..
బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరు వెంకటేశ్వరరావు
మోతె, నవంబర్ 14 (విజయక్రాంతి):- గ్రామీణ ప్రాంత ప్రజలకు నేత్ర వైద్య సేవలను(Eye care services) చేరువ చేయాలనే లక్ష్యంతో సూర్యాపేట జిల్లా(Suryapet District) మోతె మండలం సర్వారం గ్రామంలో అరుణ కంటి ఆసుపత్రి(Aruna Eye Hospital) ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని(Free Eye Medical Camp) నిర్వహించారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరు వెంకటేశ్వరరావు(BRS District Leader Eluru Venkateswara Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపు ప్రతి ఒక్కరి జీవితంలో అమూల్యమైనదని, చూపు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేత్ర పరీక్షలు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూడు నగేష్, ఉపసర్పంచ్ పల్స మల్సూర్, గ్రామ పెద్దలు మిక్కిలినేని పురుషోత్తమరావు, వైద్యులు బాషా నాయక్, చామంతి, వార్డు సభ్యుడు వద్దే మల్సూర్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.