కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు రూ.26 వేలకు పెంచాలి
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government hospitals) పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికుల కనీస వేతనాలను రూ.26 వేలకు పెంచాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్ GGH ఆసుపత్రిలో కార్మికులు ఏడో రోజు నిరసన చేపట్టారు.
ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని, పండుగ సెలవులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్, బ్రాంచ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు నీల, అధ్యక్షురాలు మమత, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగన్న, నరేందర్, కోశాధికారి మాదేవి తదితరులు పాల్గొన్నారు.