పరీక్షల నిర్వహణపై పరిశీలన
07-10-2026 | 04:55pm
జైనూర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జైనూర్(Jainoor) మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ డిడి జాదవ్ అంబాజీ బుధవారం ఆకస్మికంగా సందర్శించి ఎస్‌ఏ–1 పరీక్షల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, వసతి, భోజనం, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతి కల్పించాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ఆత్రం పార్వతి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.