మాయమాటలని నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దు..
* జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి...
ఆదిలాబాద్, అక్టోబర్ 07 (విజయక్రాంతి): మంచి చెడు తెలియని వయసులో ఏది.. గుర్తు తెలియని వ్యక్తులు చెప్పిన మాయమాటల్లో పడి ఆడపిల్లలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, కష్టపడుతూ ఉన్నంత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి. హుస్సేన్(DLSA Secretary B. Hussain) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎల్ఎస్ఎ సెక్రెటరీ బి. హుస్సేన్ మాట్లాడుతూ... అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయని వాటిని అందిపుచ్చుకొని తమ లక్ష్యాలను సహకరించుకోవాలని సూచించారు. బాల్య వివాహం చట్టరీత్య నేరమని అలా చేయించిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు లక్ష జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, 100, 112కి సమాచారం ఇవ్వాలన్నారు. బాల్య వివాహంతో జీవితాలు అక్కడే ముగిసిపోతాయని బాల్య వివాహానికి నిర్మూలనకై ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారం, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు అరుగుల అశోక్, చంద్రకాంత్ చౌదరి, ఉమేష్ రావు డోలే, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, డిసిపియు కౌన్సిలర్ పద్మ, ఎయిడ్ స్వచ్ఛంద జిల్లా కోఆర్డినేటర్ కె వినోద్, నీతి ఆయోగ్ చైల్డ్ రైట్స్ అసోసియేట్ దేవిశ్రీ, కమ్యూనిటీ మొబిలైజర్లు సంపత్ కిరణ్, కే. శంకర్ లు ఉన్నారు.