పశువుల రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

22-11-2026 | 07:53pm

బెజ్జూర్ నవంబర్ 22 (విజయక్రాంతి): బెజ్జూర్ పోలీస్ స్టేషన్(Bejjur Police Station) పరిధిలో అక్రమ పశువుల రవాణాపై పోలీసుల మెరుపు దాడి నిర్వహించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠా పట్టివేత –18 పశువులు, 4 వాహనాలు, 6 సెల్‌ఫోన్లు, రూ.50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. మండలంలోని మొగవెల్లి గ్రామ శివారులో అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ కె. రమేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.

ఈ సందర్భంగా రెండు మోటార్ సైకిళ్లు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక అశోక్ లేలాండ్ వాహనం, ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించి కొందరు పరారవగా, ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇప్ప శ్రీకాంత్, సమీర్, ఫిరోజ్, ఆయుబ్, షామీర్ సాయికుమార్, షేక్ బాబా, పరారీలో షేక్ రఫిక్, షేక్ బాబా, సయ్యద్ కాజా, ఉన్నారు.పరారీలో ఉన్న మిగిలిన వ్యక్తుల కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అక్రమ పశువుల రవాణాకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్, హెచ్చరించారు. వారి వెంట హెడ్ కానిస్టేబుల్ ఉమేష్, కానిస్టేబుల్ మల్లేష్ మహేందర్ పురుషోత్తం ఉన్నారు.

మరిన్ని వార్తలు