ప్రకృతి ఒడిలో కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం

22-11-2026 | 07:47pm

కమ్మ సంఘం వనభోజనోత్సవం

హేమాచలునికి ప్రత్యేకపూజలు 

ములుగు, నవంబర్ 22 (విజయక్రాంతి): కార్తీక మాసం సందర్భంగా ప్రకృతి అందాల నడుమ, చారిత్రక ప్రాశస్త్యం కలిగి  రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా(Mulugu district) మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రం ఆదివారం ములుగు జిల్లాలోని కమ్మ కుటుంబ సభ్యులతో సందడిగా మారింది. శ్రీ గణపతి దేవా కాకతీయ కమ్మ సేవా సంఘం నాయకుల ఆధ్వర్యంలో హేమాచల క్షేత్రం వద్ద వన భోజనాల కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని అన్ని మండలాలలోని కమ్మ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం హేమాచల క్షేత్రంకు చేరుకుని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని స్వామి వారికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారి సమీపంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన కమ్మ కుల బంధువులు వన భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కమ్మ సంఘాల సమైఖ్య ప్రధాన కార్యదర్శి, కమ్మ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు గంగవరపు రామకృష్ణ ప్రసాద్, కమ్మ సేవా సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు సూరపనేని నాగేశ్వర రావు, కాకతీయ కమ్మ సేవా సంఘం మంగపేట మండల అధ్యక్షుడు తోట రమేష్, కమ్మ సంఘం జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు