ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు అరిగెల మద్దతు

28-10-2026 | 07:40pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి):జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్(Collectorate) ఎదుట గత వారం రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపడుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరరావు(Senior leader Arigela Nageswara Rao) బుధవారం మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా అరిగెల నాగేశ్వరరావు మాట్లాడుతూ వారం రోజులుగా ఉద్యోగులు నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల సంతోష్ కుమార్, నాయకులు మురళి గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు