ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలుగవద్దు
జిల్లా కలెక్టర్ కుమార దీపక్
లక్షేట్టిపేట,నవంబర్ 27(విజయక్రాంతి) : జిల్లాలో ధాన్యం కొనుగోలు(Grain procurement) ప్రక్రియలో రైతులకు(Farmers') ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం అంకతిపల్లి గ్రామంలో జై హనుమాన్ గ్రామ సంఘం, ఇటిక్యాల గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌరసరఫలాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్యలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తూకం, రికార్డుల నిర్వహణ, గన్నీ బ్యాగుల లభ్యత తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని తెలిపారు. ధాన్యం గ్రేడ్ ఏ రకానికి రూ.2461, సాధారణ రకానికి రూ.2441లుగా ధర నిర్ణయించడం జరిగిందని, సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 ల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.
మండలంలోని లింగాపూర్‌లో గల శ్రీకృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించి మిల్లులో ధాన్యం నిల్వలు, బియ్యం నాణ్యత, మిల్లింగ్ ప్రక్రియ, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య,మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్,ఏపీఏం భూమక్క,కౌన్సిలర్స్ సిద్ధార్థ, పెట్టెం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.