ఐ ఐ టి ఈ. అభ్యాస్ అకాడమి పై అవగాహన
తూప్రాన్, అక్టోబర్ 28, (విజయక్రాంతి): ఐ.ఐ.టి ఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కోణంలో తూప్రాన్ గీతా పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మ్యాథ్స్ మరియు సైన్స్ విభాగాల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారికి తగు సూచనలిస్తూ భవిష్యత్తులో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఈ-అభ్యాస్ అకాడమీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈసందర్బంగా పాఠశాల చైర్మన్ ఉష మాట్లాడుతూ.. ఈ అభ్యాస్ అకాడమీ విద్యార్థులకు ఒకవరం లాంటిదని అన్నారు. భవిష్యత్తులో పోటీని ఎదుర్కునేలా ఈ అభ్యాస్ తర్ఫీదు పొందుతారని అన్నారు. కార్యక్రమంలో ఈ అభ్యాస్ ఫౌండర్ భువనగిరి పవన్ ఫణి శాస్త్రి, కరెస్పాండంట్ రామాంజనేయులు, డైరెక్టర్లు భరత్, డాక్టర్ మౌనిక, ప్రిన్సిపాల్ అరుణ, ప్రేమ్ రాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.