విద్యార్థుల ప్రతిభకు ఆర్ట్ అండ్ కల్చరల్ వేదిక
ఆసిఫాబాద్, (విజయక్రాంతి):జిల్లాలోని 18 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లా స్థాయి ఆర్ట్ అండ్ కల్చరల్ కార్యక్రమం(District-level Art and Cultural Program) నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సంపూర్ణ వికాసానికి దోహదపడతాయని అన్నారు.
అనంతరం ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం, నృత్య పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, న్యాయ నిర్ణేతలు రమేష్, గుర్రాల వెంకటేశ్వర్లు, రామస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.