మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
200 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు. ఉచితంగా మందుల పంపిణీ
కంగ్టి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో బాలాజీ అనురాధ ఆసుపత్రి(Balaji Anuradha Hospital) సౌజన్యంతో టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి(Mega Medical Camp) విశేష స్పందన లభించింది. ఈ శిబిరానికి 200 మందికి పైగా రోగులు హాజరయ్యారు.వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.శిబిరానికి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహించి,వైద్య సలహాలు అందించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు టీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు జి.సత్యం, ప్రధాన కార్యదర్శి భూమయ్య తెలిపారు.
భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, ఉపాధ్యక్షుడు వెంకటేశం, నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి జావిద్, ఉపాధ్యక్షులు నుకల రాజు, శీర్మారామ్రెడ్డి, రమేష్ గౌడ్, బిరాదర్ సంగప్ప, నిసార్, జాయింట్ సెక్రటరీ జైపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరారెడ్డి, మండల జర్నలిస్టులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.