పాపన్‌పేట్‌లో పోలీసుల తనిఖీలు
5 లీటర్ల గుడుంబా స్వాధీనం..
100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
బెజ్జూర్, నవంబర్ 3 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం పాపన్‌పేట్ గ్రామంలో ఎస్‌ఐ కె. రమేష్(SI Ramesh) ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తయారు చేస్తున్న 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే 20 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు.
గ్రామస్తులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఇతరులకు చెప్పవద్దని సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ రమేష్ విజ్ఞప్తి చేశారు.