టీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

07-10-2026 | 06:58pm

జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ రహమాన్

జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్ సంపత్ కుమార్

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం (TUWJ IJU) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ రహమాన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకాశ్ గౌడ్, సహాయ ఎన్నికల అధికారి నరేష్ తెలిపారు.టీయూడబ్ల్యూజే–ఐజేయూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖకు సంబంధించి అధ్యక్షుడితో పాటు వివిధ హోదాల్లో నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షుడు: అబ్దుల్ రహమాన్,జిల్లా ఉపాధ్యక్షులు: నవీన్ గౌడ్, కేంద్రే చంద్రకాంత్, మేకల శ్రీనివాస్, వారణాసి శ్రీనివాస్, భూక్య గిరిజ పరశురాం,జిల్లా ప్రధాన కార్యదర్శి: ఎస్. సంపత్ కుమార్,జిల్లా సహాయ కార్యదర్శులు: చిలుకూరి రాధాకృష్ణ, కడతల సాయి, దూడ గోపి, చవహన్ రామేశ్వర్, అహ్మద్ పాషా,జిల్లా కోశాధికారి: అడప సతీష్,సంయుక్త కార్యదర్శులు: టి. అమూల్ గౌడ్, బైరగోని రాజు, బి. మహేష్, ఎండీ నౌషాద్, దేవునూరి రమేష్ ,కార్యవర్గ సభ్యులు: కాంబ్లే అన్నారావు, ఇప్ప పోచయ్య,  నామ తిరుపతి, కమలాకర్, బాల ప్రసాద్ గౌడ్, జాదవ్ రోహిదాస్, సాయి సృజన్, అహ్మద్ అమీన్, రాథోడ్ రమేష్

నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు, హక్కుల సాధన కోసం ఐక్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ ఎన్నిక పట్ల జిల్లా జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేసి నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు