మాపై దాడులు ఆపితే 8,300 కోట్లు ఇస్తాం!
- హౌతీలకు సౌదీ ఆఫర్
- మధ్యవర్తిగా పాక్, ఇరాన్, టర్కీ
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కీలక చర్చలు
- అయినా ఆగని హౌతీల దాడులు
- సౌదీలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపైకి మిస్సైల్స్
టెహ్రాన్, అక్టోబర్ 27: ఒకవైపు ఇరాన్‌పై(Iran) అమెరికా, ఇజ్రాయెల్ దాడులు(Attacks by America and Israel).. మరోవైపు సౌదీ అరేబియాపై(Saudi Arabia) ఇరాన్ మద్దతుదారులైన హౌతీల దాడులతో(Houthi attacks) పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుం దో తెలిసే పరిస్థితి లేదు. హౌతీల దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సౌదీ.. మెట్టుదిగివచ్చింది. తమపై దాడులు ఆపితే.. 100 కోట్ల డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) ఇస్తామని ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ ఆఫర్‌ను స్వయంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నది. దీనికి.. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ సమావేశం ఏర్పాటు చేయడం, అందులో పాకిస్థా న్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, టర్కీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇబ్రహీం కలిన్ పాల్గొనడం బలం చేకూరుస్తున్నది.
సౌదీ రక్షణ మంత్రి తన దేశం నుంచి డబ్బులతోనే టెహ్రాన్‌కు వచ్చారని, హౌతీలకు అందజేయడమే తరువాయి అని ఇజ్రాయెల్ సహా అంతర్జాతీయ మీడి యా పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హౌతీలు అంగీకరిస్తే ఈ మొత్తం సౌదీ ఇవ్వనుందని తెలిపింది. మరికొన్ని మీడి యా సంస్థలు మాత్రం ఆ మొత్తం డబ్బులను ఇరాన్, పాకిస్థాన్, టర్కీ మధ్యవర్తిత్వం లో హౌతీలకు సౌదీ అందజేసిందని రాసుకొచ్చాయి. సౌదీ నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు.
రిఫైనరీపై మిస్సైల్స్‌తో అటాక్
యెమెన్‌లోని ఇరాన్ మద్దతుదారులైన హౌతీ తిరుగుబాటు దళాలు కొన్నాళ్లుగా సౌదీ అరేబియాపై దాడులకు దిగుతున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. దానికి ప్రతిగా సౌదీపై హౌతీలు విరుచుకుపడుతున్నారు. పైగా యెమెన్‌లోని తమ కార్యకలాపాల్లో సౌదీ జోక్యం చేసుకుంటున్నదన్న కోపంతోనూ మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆ దాడులు మరింత పెరిగాయి. దాడులు ఆపితే 100 కోట్ల డాలర్లు ఇస్తామని సౌదీ యువరాజు ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నా.. హౌతీలు మాత్రం తమ అటాక్స్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజా గా సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం (రిఫైనరీ)పై మిస్సైల్స్‌తో దాడులు చేశారు. ఈ రిఫైనరీ రాస్ తనూరాలో ఉంది. దాడుల వల్ల కేంద్రంలో మంటలు చెలరేగాయి. కొం త ఆస్తినష్టం వాటిల్లింది. అదేవిధంగా రియాద్‌లో రెండు బాలిస్టిక్ క్షిపణులను హౌతీలు ప్రయోగించగా.. వాటిని సౌదీ దీటుగా అడ్డుకుంది. పలు విమానాశ్రయాలపైనా హౌతీ లు మిస్సైల్స్‌ను వేశారు.
అయితే.. ఇప్పటికే ఇరాన్ యుద్ధం, హర్మోజ్లో రవాణాకు ఆ టంకాలతో ప్రపంచమంతా ఇంధన సమస్య ఏర్పడింది. ఇప్పుడు సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై హౌతీలు దాడి చేయడంతో మరింత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఈ రిఫైనరీ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను శుద్ధి చేయగలదు. దాడి వల్ల యంత్రాల వర్కింగ్‌లో ఆటంకాలు కలిగినట్లు ప్రచారం జరుగుతున్నది.