రాజీవ్ ప్రధాని కావడాన్ని వ్యతిరేకించా!

28-10-2026 | 05:25am

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటన

పుస్తకం విడుదలయ్యాక నాటకీయ పరిణామాలుంటాయని వ్యాఖ్య

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి(Rajiv Gandhi, Prime Minister) కావడాన్ని తాను వ్యతిరేకించానని, తన పుస్తకంలోని విషయాలను తెలుసుకున్నాక కొంతమంది వారి అభిప్రాయాలను మార్చుకోవచ్చని, మరికొంతమం ది విభేదించవచ్చని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ(AICC chief Sonia Gandhi) అన్నారు. మంగళవారం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్(Belonging: A Journey of Love)’ పుస్తకానికి సంబంధించిన మరో పోస్ట్‌ను ఎక్స్‌లో సోనియాగాంధీ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాను ఆత్మకథ ఎందుకు రాయాలని అనుకున్నానో వివరించారు.

తాను అనుభవించిన వివరాలను పొందుపరిచేందుకు పుస్తకం ఒక వేదికను కల్పించిందన్నారు. పుస్తకం విడుదలయ్యాక నాటకీయ పరిణామాలకు దారితీస్తుందన్నారు. తన గురించి వస్తున్న వార్తల్లో అనేకం అవాస్తవాలున్నాయని చెప్పారు. పుస్తకం ద్వారా వాస్తవాలను చెప్పదలచుకున్నట్లు వివరించారు. 544 పేజీలున్న ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల చేయనున్నారు. ఇందులో సోనియాగాంధీ బాల్యం నుంచి ప్రస్తుతం వరకు జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను, రాజకీయ ప్రయాణాన్ని వివరించారు.

మరిన్ని వార్తలు