రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కేసముద్రం: ఖమ్మం జిల్లా(Khammam District), ఎస్ ఎఫ్ ఎస్, బల్లేపల్లి పాఠశాలలో(Ballepalli School) ఈనెల 28, 29 తేదీలలో నిర్వహించనున్న, 70వ ఎస్ జీ ఎఫ్ అండర్ 17 రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు(Netball competitions) కేసముద్రం స్టేషన్ పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల(PM Shri ZPHS School) విద్యార్థి గుగులోత్ అక్షయ్ ఎంపికైనట్లు, ప్రధానోపాధ్యాయులు గంగుల శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్. కొమ్ము రాజేందర్ తెలిపారు.అక్షయ్ ఈనెల 18వ తేదీన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండ లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, ఎంపికైన క్రీడాకారున్ని పాఠశాల ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు సుధాకర్, హరీష్, రాకేష్, యాకన్న, మహబూబ్ తదితరులు అభినందించారు.