గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
కుటుంబానికి పోలీస్ శాఖ పక్షాన రూ.30 వేల తక్షణ ఆర్థికసహాయం..
మహబూబాబాద్ (విజయక్రాంతి): గూడూరు పోలీస్ స్టేషన్లో(Gudur Police Station) విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీ. శ్రీనివాస్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్(SP Dr. Sabarish) ఆదేశాల మేరకు డి.ఎస్.పి తిరుపతి రావు, గూడూరు సీఐ వినయ్, ఎస్ఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది మృతుడి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి తక్షణ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబానికి 30,000 రూపాయలను అందజేశారు.
కష్టకాలంలో పోలీస్ శాఖ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరాం చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ బాదె రామన్న, ఈసీ సభ్యులు ఈసం సురేష్ తదితరులు పాల్గొన్నారు.