విద్యా ఫలితాల్లో మానుకోట ముందంజలో ఉండాలి

12-11-2026 | 11:26pm

కలెక్టర్ స్నేహ శబరిష్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యా ఫలితాల్లో మానుకోట జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(Collector Sneha Sabarish) అన్నారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం నరసింహులపేట, పెదనాగారంలో ప్రాథమిక స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Government primary school), అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ... విద్యాసామర్ధ్యాలను వారి యొక్క సబ్జెక్టుల వారిగా స్వయంగా పరీక్షించారు.

ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై అవగాహన కల్పించాలని, ఇప్పటికే జిల్లాలో ప్రవేశపెట్టిన ఎఫ్ ఎల్ ఎన్, లీఫ్ లర్నింగ్ ఇంగ్లీష్ తదితర అంశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్నపిల్లలకు గర్భిణీలకు బాలింతలకు, పౌష్టికా ఆహారాన్ని అందించాలని, పాఠశాల కేంద్రం పరిధిలోని శ్యామ్ మామ్ పిల్లలను గమనిస్తూ ఉండాలని తెలిపారు.

పిల్లలకి అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలలో చదువుతున్న పిల్లలకు ప్రభుత్వం నుండి కల్పించే అన్ని సౌకర్యాలు పక్క డైట్ మెనూ మధ్యాహ్నం భోజనం, యూనిఫామ్, టెస్ట్ బుక్స్, తదితర వస్తువులను షెడ్యూల్ ప్రకారం అందించాలని, పిల్లల మానసిక పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, సిలబస్ లోగో సబ్జెక్టుల వారిగా పాఠాలను పూర్తి చేయాలి.

సంబంధిత ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పిల్లల యొక్క హాజరు శాతం కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సూచించారు. ఆర్.బి.ఎస్.కె సిబ్బంది చేత వైద్య పరీక్షలు నిర్వహించాలని, డిజిటల్ తరగతుల ద్వారా పిల్లలకు   విద్యా బోధనలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఏజిసి శ్రీరాములు, ఏఏం వో అప్పారావు, విజయలక్ష్మి, సంబంధిత మండలాల తహసిల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు