ఇందిరమ్మ బీమా అమలుకు పకడ్బందీ చర్యలు

18-11-2026 | 07:40pm

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేయబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) అని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా(Financial Security) ఇవ్వడం జరుగుతుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీగా ఈ పథకం అమలుకు చర్యలు పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు ప్రభుత్వం సూచించిన విధంగా జీవిత బీమాను(Life Insurance) అమలు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(Mahabubabad District Collector Sneha Shabarish) ఆదేశించారు.

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ పథకం అమలు తీసుకోవలసిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా విస్తృత ప్రచారం కల్పించి, క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరు ఎప్పుడూ హాజరు అయ్యేవిధంగా రూట్ మ్యాప్ ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని, ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఏర్పడితే సంబంధిత మున్సిపల్, ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యాలయలలో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు కోసం ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం,  డిఆర్ఓ నాగలక్ష్మి, డిపిఓ రేవంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు