32వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం!

18-11-2026 | 07:31pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో ప్రతి వార్డుకు రూ.50 నుంచి 60 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణం(Road construction) చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) పేర్కొన్నారు.

మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని 32వ వార్డు బుక్క బజారులో బుధవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మహమ్మద్ రెహనా పర్వీన్ ఖలీల్, మున్సిపల్ కమిషనర్ ఎం. వినోద్ కుమార్, డీఈ ఉపేందర్, పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, జిల్లా, పట్టణ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు