వస్పులలో కాంగ్రెస్‌కు జోష్

12-11-2026 | 10:36pm

బీఆర్ఎస్, బీజేపీ నుంచి హస్తం గూటికి కీలక నేతలు! 

మిడ్జిల్: మిడ్జిల్ మండలం వస్పుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నాయకుల చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గొరిగే సత్యం, గొరిగే శ్రీశైలం, బీజేపీ నాయకుడు బొడ్డు శీను కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు పేర్కొన్నారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు