ఎన్సీసీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
18-11-2026 | 07:35pm
ఆలేరు, నవంబర్ 18 (విజయక్రాంతి): ఎన్సీసీ శిక్షణతో(NCC Training) విద్యార్థులకు విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Aleru Zilla Parishad High School) ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, ఆర్మీ అధికారి హవల్దార్ ఉమేష్ కాంబ్లే అన్నారు. బుధవారం ఆలేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండేళ్ల ఎన్సీసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఏ సర్టిఫికెట్లు అందజేశారు.
ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని తెలిపారు. సర్టిఫికెట్లు పొందిన వారిలో భార్గవి, భవాని, రేచల్, వర్షిత, సంజయ్, రిత్విక్ తదితరులు ఉన్నారు.