కరకరలాడే పాలక్ పకోడి.. 15 నిమిషాల్లో రెడీ!

18-11-2026 | 07:38pm

సాయంత్రం అవగానే వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తోందా? అయితే కరకరలాడే పాలకూర పకోడీ(Palak Pakora)ని ఇంట్లోనే ప్రయత్నించండి. తక్కువ పదార్థాలతో, సులభమైన పద్ధతిలో తయారయ్యే ఈ స్నాక్ టీ టైమ్‌(Snacks Tea Time)కు మంచి ఎంపిక.

కావాల్సిన పదార్థాలు:

  1. పాలకూర ఆకులు – 2 కప్పులు
  2. శెనగపిండి – 1 కప్పు
  3. బియ్యప్పిండి – ¼ కప్పు
  4. పచ్చిమిర్చి – 2
  5. కారం – ½ టీస్పూన్
  6. పసుపు – చిటికెడు
  7. వాము – ¼ టీస్పూన్
  8. ఇంగువ – చిటికెడు
  9. ఉప్పు – తగినంత
  10. చాట్ మసాలా – కొద్దిగా
  11. నూనె – వేయించడానికి

తయారీ విధానం:

ముందుగా పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడుచుకోవాలి. అవసరమైతే చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, వాము, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. పచ్చిమిర్చి తరుగు కూడా జత చేయాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. పిండి మరీ పలుచగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి.

బాణలిలో నూనె వేడి చేసి పాలకూర ఆకులను పిండిలో ముంచి నూనెలో వేయాలి. మీడియం మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చి కరకరలాడే వరకు వేయించాలి. చివరగా పకోడీలపై చాట్ మసాలా చల్లి వేడివేడిగా వడ్డించాలి. టమాటా కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే రుచి మరింత పెరుగుతుంది. అంతే.. సింపుల్‌గా రుచికరమైన పాలకూర పకోడి రెడీ!

మరిన్ని వార్తలు