బ్యానర్లు ధ్వంసం చేయడం సరికాదు
18-11-2026 | 07:36pm
రాజాపూర్ నవంబర్ 18: మండలంలోని పలువు గుట్ట తండాలో(Gutta Thanda) గిరిజనులు తుల్జా భవాని మాత ఉత్సవాలు(Tribal celebrations of Goddess Tulja Bhavani) మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమాన గిరిజన నాయకుడైన జరుపుల భాస్కర్ నాయక్ బ్యానర్లు రంగారెడ్డి గూడా గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇది నచ్చని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో బ్యానర్లు ధ్వంసం(Banners destroyed) చేసినట్లు జేబీఎన్ యువసేన సభ్యులు(JBN Yuvasena members) తెలిపారు. తవ అభిమాన నాయకుడు బ్యానర్లు చింపినంత మాత్రాన నాయకుడి పై ప్రేమ ఏమాత్రం తగ్గదని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం చేయదని ఈ సందర్భంగా హెచ్చరించారు.