లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
జడ్చర్ల పట్టణంలోని అర్ధరాత్రి 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జడ్చర్ల, నవంబర్ 10: జడ్చర్ల పట్టణం(Jadcherla town)లోని అర్ధరాత్రి 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని త్రీ స్టార్ హోటల్ ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి కారు బలంగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే ఎస్సై మృతి చెందారని మరొకరి పరిస్థితి విషమంగా ఉందని జయప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన కిల్జీ ప్రసాద్ హైదరాబాద్లో ప్రవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడని ఈ దీపావళి పండుగకు స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారని జడ్చర్ల పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై కిల్జి ప్రసాద్ నడుపుతున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో కిల్జీ ప్రసాద్ 39 అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లాలని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గుర్తుతెలియని క్షతగాత్రుడి వివరాల కోసం అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.