పల్లెకు పని ఎట్లా? సాధ్యమైతే పని కల్పిస్తారా?

03-11-2026 | 05:10am

జూలపల్లి అటవీ ప్రాంతంలో కుంట పనులు ప్రారంభం

మొత్తానికి మొత్తంగా యంత్రానికి పని ఇస్తే ఎట్లా!

అటవీలో కుంట నిర్మాణానికి 2.18 లక్షలు మంజూరు 

ఉపాధి లేక కడుపు మార్చుకుని పని వెతుకుతున్నామంటున్న జనం 

మహమ్మదాబాద్ నవంబర్ 2 : వర్షాకాలం ఈ ఏడాది లేకపోవడంతో గ్రామాల్లో రైతుల(Farmers') తో పాటు కూలీల పరిస్థితి తీర ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో వ్యవసాయ పొలంలో(Agricultural field) పనులు చేసేందుకు వెళ్లి ఎందుకు కూడా యంత్రాలు ఎక్కువ కావడంతో వ్యవసాయ పనులు కూడా కొంతమేరకు తగ్గాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మేరకు జూలపల్లి అటవీ ప్రాంతంలో(Julapalli forest area) కుంటను నిర్మించేందుకుగాను సంబంధిత శాఖ రూ 2.18లక్షలు మంజూరు చేసింది.

60 మీటర్ల అప్పుడు 9 మీటర్ల లోతు ఈ కుంటను ఉండేలా రూపకల్పన చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో జెసిబి సహాయంతో ఈ గుంట తవ్వకాలను చేపట్టిన అధికారులు బాగానే ఉన్నప్పటికీ పల్లెల్లో జీవనం కొనసాగిస్తున్న జూలపల్లి గ్రామస్తులకు జెసిపికి 50 శాతం పని కల్పించిన తమకు కొంత పని కల్పించాలని వేడుకుంటున్నారు. సాధ్యసాధ్యులను పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటే తమకు కొంతైనా ఉపాధి లభిస్తుందని కూలీలు చెబుతున్నారు.

 ప్రభుత్వ పనిలే ఇలా ఉంటే పని ఎక్కడ లభించెను?

 కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వ మైన ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తుంటాయి. ఈ తరుణంలో జూలపల్లి అడవి ప్రాంతంలో మంజూరైన ఈ పనిలో ఆ గ్రామంలోని కొంతమంది కూలీలకు పనులు కల్పిస్తే వారికి మేలులు జరుగుతుందని వారు భావిస్తున్నారు. అధికారులు పనులు ప్రారంభించినప్పటికీ ఉపాధి హామీ కూలీలో భాగంగా అయినా సరే తమకు పని కల్పించాలని గ్రామస్తులు చెబుతున్న మాట. 

 యంత్రాలతో వేగంగా... ఉపాధి ముఖ్యమే కదా

 యంత్రికరణతో వేగంగా పనులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ పల్లెల్లో జీవనం సాగిస్తున్న ప్రజలకు ఉపాధి మార్గంగా పనులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జనం కోరుతుండ్రు. ప్రభుత్వ పెద్దలైన అధికారులైన స్పందించి తమకు అవకాశం ఉన్న ప్రతి పనిలోనూ ఉపాధి మార్గంగా పనులు కల్పించాలని వేడుకుంటుండ్రు. ఈ పనిలో కూడా అటవీశాఖ తమపై సానుకూలంగా స్పందించి పనులు కల్పించాలని కోరుతున్నప్పటికీ ఆ శాఖ అధికారులు ఉన్నత అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారు చూడాలి.

మరిన్ని వార్తలు