ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం
మిడ్జిల్: మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల(Pre-Primary Classes)ను ఎంఈఓ వెంకట్రాములు(Midjil MEO Venkatramulu), గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్న వయసు నుంచే చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను నేర్పించేందుకు ప్రీ ప్రైమరీ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గౌస్, అల్వాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.