గురుకుల పాఠశాల నుండి విద్యార్థి అదృశ్యం
జడ్చర్ల: జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా(Pochammagadda Thanda)లోని గురుకుల పాఠశాల నుండి 10వ తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ (TGSWRS/JC - B), బాలానగర్ - పోచమ్మగడ్డ తండాలో 10వ తరగతి (A-సెక్షన్) చదువుతున్న విద్యార్థి కె. కార్తీక్ ఈ నెల 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల మధ్య పాఠశాల నుండి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు.
సాయంత్రం స్టడీ అవర్స్ సమయంలో విద్యార్థి పాఠశాలలో లేడని గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పాఠశాల ప్రధానాచార్యులు 17/11/2026 తేదీన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు.పోలీసులు తెలిపినట్లు, క్రమశిక్షణ చర్యలో భాగంగా ఈ విద్యార్థిని ఈ నెల 11వ తేదీ నుండి సుమారు రెండు వారాల పాటు పాఠశాల నుండి బహిష్కరించారు.
బహిష్కరణ కాలం పూర్తి కాకముందే 16వ తేదీన విద్యార్థి పాఠశాలకు వచ్చి అనుమతి లేకుండా వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థి అదృశ్యం(Student Missing)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, పోచమ్మగడ్డ తండా, బాలానగర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టామని, విద్యార్థి స్నేహితులు, బంధువులను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.విద్యార్థిని చూసిన వారు, ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.