నషా ముక్త్ భారత్ సైకిల్ యాత్రకు వీడ్కోలు

18-11-2026 | 12:08pm

ఆదిలాబాద్,(విజయక్రాంతి): నషా ముక్త్ భారత్(Nasha Mukt Bharat) అనే గొప్ప ఆశయంతో 62 ఏళ్ల విజయలక్ష్మి(Vijaya Lakshmi) చేపట్టిన సైకిల్ యాత్ర కు జిల్లా నుండి రెడ్ క్రాస్ సొసైటీ(Red Cross Society) సభ్యులు వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ లోని భీమవరం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు సుమారు 3 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర(Cycle Yatra) చేపట్టిన విజయలక్ష్మి రెండు రోజుల పాటు జిల్లాలోని పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు.

కాగా బుధవారం జిల్లా నుండి మహారాష్ట్రకు పయనం అయ్యారు. ఈ సందర్భంగా నషా ముక్త్ భారత్ లక్ష్యానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఆడే క్రాంతి కుమార్(Red Cross Society District Chairman Dr.Aude Kranthi Kumar) పేర్కొన్నారు. మహారాష్ట్ర లోకి వెళ్తున్న సైకిల్ యాత్రకు జెండా ఊపి, శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజేశ్వర్ రావు, ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డా. జక్కుల శ్రీకాంత్, యూరాలజిస్ట్ డా. కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు